బ్రేకింగ్ : ఆయనే తొలి టెర్రరిస్ట్.. అసద్ వ్యాఖ్యలకు రాజాసింగ్ కౌంటర్

by Sathputhe Rajesh |
బ్రేకింగ్ : ఆయనే తొలి టెర్రరిస్ట్.. అసద్ వ్యాఖ్యలకు రాజాసింగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీరామనవమి సందర్భంగా రాజాసింగ్ నిర్వహించిన శోభాయాత్రలో కొంత మంది గాడ్సే ఫోటో ప్రదర్శించడంపై నిన్న అసద్ చేసిన వ్యాఖ్యలకు రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. తొలి టెర్రరిస్ట్ నాథూరామ్ గాడ్సే కాదని.. తెలంగాణలో దమన కాండ సాగించిన ఖాసీం రజ్వీ అన్నారు. శోభాయాత్రలో శివాజీ, వీర సావర్కర్ ఫోటోలు ఓవైసీకి కనిపించలేదా అని ప్రశ్నించారు.

కాగా గాడ్సే ఫోటోతో మొదలైన వివాదం రజ్వీని తాజాగా సీన్ లోకి లాగినట్లయింది. అయితే రాజాసింగ్ శోభాయాత్రలో గాడ్సే ఫోటో ప్రదర్శించడంపై అసద్ స్పందిస్తూ.. దేశంలో మొదటి టెర్రరిస్ట్ గాడ్సేనే అని ఆయన ఫోటోలు ప్రదర్శిస్తుంటే పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు. హజరీ, ఒసామా బిన్ లాడెన్ ఫోటోలతో ఎవరైనా డ్యాన్స్ లు, ర్యాలీలు చేస్తే మజ్లిస్ పార్టీపై నోరు పారేసుకునే వారన్నారు. ఎంఐఎం కారణంగానే హైదరాబాద్ ఉగ్రవాదుల స్థావరంగా మారిందని చెప్పి పోలీసులు ఎంఐఎం కార్యకర్తలను అరెస్ట్ చేసేవారన్నారు. కాగా అసద్, రాజాసింగ్ మాటల యుద్ధం తెలంగాణలో హీట్ పుట్టిస్తోంది.

Advertisement

Next Story