‘హాక్‌–ఐ’ యాప్ హ్యక్..? ప్రభుత్వం వెంటనే స్పందించాలని నెటిజన్ల డిమాండ్

by Ramesh N |   ( Updated:2024-06-04 11:59:56.0  )
‘హాక్‌–ఐ’ యాప్ హ్యక్..? ప్రభుత్వం వెంటనే స్పందించాలని నెటిజన్ల డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ కేటుగాళ్లు పలు యాప్స్‌ను హ్యాక్ చేసి ప్రజల వ్యక్తిగత డేటాను సేకరిస్తుంటారు. అయితే, సైబర్ కేటుగాళ్లు ఏకంగా పోలీసు డిపార్ట్‌మెంట్ యాప్‌ను హ్యక్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. బాధితులకు సత్వర సాయం అందించడంతోపాటు ప్రజలు పోలీసుల మధ్య సమాచార మార్పిడికి వేదికగా ఉండేలా తెలంగాణ పోలీసులు రూపొందించిన మొబైల్‌ యాప్‌ ‘హాక్‌–ఐ’ గురిచింది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మహిళల రక్షణ కోసం ఈ యాప్‌ ఎంతో ఉపయోగపడుతోంది. అలాంటి ఈ హాక్-ఐ యాప్‌ను సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేసినట్లు సమాచారం.

యాప్‌లో దాదాపు 2 లక్షల మహిళలకు సంబంధించిన పేర్లు, కంప్లైంట్స్, ఫోన్ నెంబర్స్, లొకేషన్స్, ఎస్ఓఎస్ జర్నీ డీటెయిల్స్ లీక్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కృష్ణమూర్తి అనే నెటిజన్ ట్విట్టర్ వేదికగా తెలంగాణ పోలీసులకు ట్యాగ్ చేశారు. దీంతో ట్వీట్ వైరల్‌గా మారడంతో నెట్టింట చర్చానీయంశంగా మారింది. దీనిపై వెంటనే తెలంగాణ ప్రభుత్వం స్పందించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ‘హాక్‌–ఐ’ హ్యాక్ గురించి తెలంగాణ పోలీసులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement

Next Story

Most Viewed