Harsha Sai Case: యూట్యూబర్ హర్ష సాయిపై మరో కేసు.. నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు

by Ramesh Goud |
Harsha Sai Case: యూట్యూబర్ హర్ష సాయిపై మరో కేసు.. నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్ష సాయిపై మరో కేసు నమోదు అయ్యింది. యువతి ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రముఖ యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్ హర్షసాయి తనని లైంగికంగా వేధింపులకు గురి చేశాడని కేసు పెట్టిన బాధితురాలు న్యాయవాదితో కలిసి ఇవాళ నార్సింగి పోలీస్ స్టేషన్ కు వచ్చింది. తాను కేసు పెట్టిన నాటి నుండి హర్షసాయి తనను టార్చర్ చేస్తున్నాడని, మెయిల్స్ ద్వారా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. మెయిల్స్‌కు సంబంధించిన ఆధారాలను ఫిర్యాదుతో జతచేసింది.

దీంతో యువతి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. హర్షసాయిపై ఇంకో కేసు నమోదు చేశారు. కాగా హర్షసాయి తనను ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడని, తన వద్ద నుంచి రూ.2 కోట్లు కాజేశాడని ఓ మహిళ కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే దీనిపై హర్ష సాయి లాయర్ తాటికొండ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. హర్ష సాయి అమాయకుడని, డబ్బు కోసమే ఆ యువతి ఆరోపణలు చేస్తుందని అన్నారు. అంతేగాక యువతిపై హర్షసాయి బలవంతం చేశాడన్నది కట్టుకథ అని, ఆయన ఓ సక్సెస్‌ఫుల్ యూట్యూబర్ అని, ఆ అమ్మాయికే హర్షసాయి అంటే ఇష్టం అని చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed