పబ్‌లో డ్రగ్స్ ప్రొత్సహిస్తే అత్యంత కఠిన శిక్షలు : డీజీపీ వార్నింగ్

by Ramesh N |
పబ్‌లో డ్రగ్స్ ప్రొత్సహిస్తే అత్యంత కఠిన శిక్షలు : డీజీపీ వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: డ్రగ్స్ నిర్మూలనపై రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతున్నది. అయితే ఈ క్రమంలోనే తెలంగాణ డీజీపీ, తెలంగాణ పోలీస్ ట్విట్టర్ వేదికగా మరోసారి ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘పబ్ ల యజమానులు డ్రగ్స్, గంజాయి లాంటి వాటిని ప్రోత్సహిస్తే శిక్షలు అత్యంత కఠినంగా ఉంటాయి. డ్రగ్స్, గంజాయి మాదకద్రవ్యాలపై నిరోధానికి తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు కృతనిశ్చయంతో ఉన్నారు. మీకు డ్రగ్స్ పట్ల ఏదైనా సమాచారముంటే వెంటనే #Dial100 లేదా 8712671111 సమాచారమివ్వండి’ అని పేర్కొంది.

పబ్ యజమానులు యువతను ఆకర్షించటానికి డ్రగ్స్, గంజాయి లాంటి వాటిని ప్రోత్సహిస్తే మాదకద్రవ్యాల చట్టాలు, శిక్షలు కఠినంగా ఉంటాయని పేర్కొంది. యువత పబ్‌లలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సమాచారం అందించాలని పోస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed