- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెచ్చగొట్టేలా మాట్లాడొద్దు.. రేవంత్ రెడ్డి కామెంట్స్ పై హరీశ్ రావు
దిశ, డైనమిక్ బ్యూరో: నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనపై అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. ఏ పరీక్షలూ రాయనివాళ్లే పోటీ పరీక్షలను వాయిదా వేయాలని దీక్షలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. నిరుద్యోగులకు ఎక్స్ వేదికగా మద్దతు తెలిపిన హరీశ్ రావు..'గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులను చర్చలకు పిలుచుకొని వారి బాధను, డిమాండ్లను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని వారిని రెచ్చగొట్టే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడి అబాసుపాలు కాకండి. వారు దైర్యం కోల్పోయే విధంగా వ్యవహరించకండి' అంటూ ట్వీట్ చేశారు. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల మొర ఆలకించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. భేషజాలకు పోకుండా వారి జీవితాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. పోలీసు బలగాలు, లాఠీలు, ఇనుప కంటెలు, బారికేడ్లతో విద్యార్థుల పోరాటాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తే అది ఫలించకపోగా మరింత ఉధతం అవుతుందని హెచ్చరించారు. నిరుద్యోగులపై భౌతిక దాడులకు పాల్పడుతూ ఇబ్బందుల పాలు చేస్తే మేము చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.