హరీశ్ రావు బ‌ృందానికి మూసీ బాధితుల గోడు

by Y. Venkata Narasimha Reddy |
హరీశ్ రావు బ‌ృందానికి మూసీ బాధితుల గోడు
X

దిశ, వెబ్ డెస్క్ : మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ యంత్రాంగం మూసీ పరివాహకం వెంట చేపట్టిన ఆక్రమణల తొలగింపు చర్యలతో నష్టపోతున్న బాధితులకు భరోసానిచ్చేందుకు వెళ్ళిన మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి బృందానికి బాధితులు తమ గోడును వినిపించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం బండ్లగూడ, హైదర్ షా కోట్ మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిలు మూసీ బాధితులను పరామర్శించి వారి సమస్యలు విన్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా నిచ్చారు.

ఈ సందర్భంగాహరీశ్‌రావు మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు సీఎం రేవంత్‌ రెడ్డికి డబ్బులు లేవు కానీ, మూసీ సుందరీకరణకు లక్షా యాభైవేల కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు. రూ.1500 కోట్లతో మూసీ సుందరీకరణ డీపీఆర్‌ చేస్తున్నారని.. రూ.150 కోట్లతో కనీస వైద్య సదుపాయాలు కల్పించలేరా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్‌ లేవని, సర్కారు ఆసుపత్రుల్లో మందులు లేవన్నారు. ఏడు నెలల నుంచి మధ్యాహ్న భోజన బిల్లులు రావట్లేదన్నారు. పాలన పక్కనపెట్టి మూసీ సుందరీకరణ అంటూ పేదల ఇండ్లు కూల్చి తుగ్లక్‌ ప్రభుత్వంలా అయిపోయిందని విమర్శించారు. ప్రజల ఉసురు పోసుకోవద్దని సూచించారు. హైడ్రా పేరుతో బలవంతంగా ఇండ్లు ఖాళీ చేయిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మూసీలో మురికి నీరు రాకుండా చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కూలిపోయిందని అంటూనే అక్కడి నుంచి గోదావరి నీళ్లు తెస్తామంటున్నారని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed