- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
JaggaReddy : హరీష్ రావు.. కొండగట్టు ప్రమాదంపై ఎందుకు మాట్లాడలేదు : జగ్గారెడ్డి

దిశ, వెబ్ డెస్క్ : ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం(SLBC Tunnel Accident) తీవ్ర బాధకరమైనది అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి(JaggaReddy). ప్రమాదం జరిగినప్పటి నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttham Kumar Reddy), జూపల్లి కృష్ణారావు(Jupalli KrishnaRao) నిరంతరం సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YSR) ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రారంభం అయిన పనులను ఎలాగైనా పూర్తి చేసి, నల్గొండ ప్రజల నీటి అవసరాలు తీర్చాలని చూశారు. ఈ ప్రాజెక్టు పనుల్లో అనుకోకుండా జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకర సంఘటన అన్నారు. ఈ ప్రమాదస్థలానికి సీఎం ఎందుకు వెళ్ళడం లేదని బీఆర్ఎస్ నాయకులు రాజకీయ ఉద్దేశంతో రాద్దాంతం చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు జరిగిన కొండగట్టు బస్సు ప్రమాదం(Kondagattu Bus Accident)పై హరీష్ రావు(Harish Rao) ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు.
ఆరోజు 65 మంది చనిపోతే మీరేందుకు వెళ్లలేదని అన్నారు. పదేళ్ళ పాలనలో జరిగిన ఘోర ప్రమాదస్థలానికి కేసీఆర్(KCR) ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. ప్రస్తుతం జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో కార్మికుల జాడ తెలియ లేదని, సహాయక చర్యలపై సీఎం స్వయంగా సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి పర్యవేక్షించారని స్పష్టం చేశారు. బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని బీజేపీ తమపై ఆరోపణలు చేస్తోందని.. బీజేపీ పార్టీలో బడా నాయకులకే క్రమశిక్షణ లేదని స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్(BJP MLA Rajasingh) అన్నారని, అలాంటివారు తమను ప్రశ్నించడం వింతగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా పాలన, రాజకీయ స్వేచ్ఛ కలిగిన పార్టీ అని జగమెరిగిన సత్యం అన్నారు. రాజకీయాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమే అని, అయితే అవి హద్దుల్లో ఉండాలని జగ్గారెడ్డి హితవు పలికారు.