- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Harish Rao: ఉన్నమాటంటే ఉలికిపాటు ఎందుకు సీతక్క: హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పాలనలో పంచాయతీలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని.. తాము ఉన్నమాటే చెప్పామని అందకు మంత్రి సీతక్కకు ఉలికిపాటు ఎందుకని మాజీ హరీష్‌రావు ప్రశ్నించారు. ఇవాళ ఆయన ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ.. పక్కా ఫేక్ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పంచాయతీలను నిర్వీర్యం చేశాయని మండిపడ్డారు. గ్రామాల్లో చేపట్టిన పనులకు బిల్లలు రాకా పారిశుధ్య నిర్వహణ ప్రత్యేక అధికారులకు తలకు మించిన భారంగా పరిణమించిందని అన్నారు. గ్రామాల్లో పరిస్థితులపై తాము చెబుతున్నవి అబద్ధాలంటూ మంత్రి సీతక్క అనడం శోచనీయమని ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చి తొమ్మిదో నెలలోకి అడుగు పెడుతున్నా.. ప్రభుత్వం గ్రామాలకు 9 పైసలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం కేంద్రం నుంచి నిధులు వచ్చినా.. అవి కూడా దారి మళ్లించి మోసం చేశారని ధ్వజమెత్తారు. గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం అటకెక్కడం మేం చెప్పింది అబద్ధమా.. సీతక్క అని హరీష్‌రావు ప్రశ్నించారు.