- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Harish Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిమాణం.. హైకోర్టులో హరీశ్ రావు క్వాష్ పిటిషన్
దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping case) కేసులో మరో కీలక పరిమాణం చోటు చేసుకుంది. (BRS) బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ఇవాళ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పంజాగుట్ట పీఎస్‌లో తన మీద నమోదైన కేసు కొట్టివేయాలని హైకోర్టులో హరీశ్‌రావు పిటిషన్ వేశారు. సిద్దిపేట నేత చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిసెంబర్ 1న హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. హరీశ్‌రావు తన ఫోన్‌టాప్ చేయించారని చక్రధర్ ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణల మేరకు హరీశ్‌రావుతో పాటు మాజీ డీసీపీ రాధాకృష్ణన్‌రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజకీయ కక్షతోనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్‌లో హరీశ్‌రావు పేర్కొన్నారు. నిరాధర ఆరోపణలు చేసి సంబంధం లేని కేసులో ఇరికించారని పిటిషన్‌లో ఆయన తెలిపారు. ఈ కేసు కొట్టివేయడంతో పాటు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని హరీశ్ రావు కోరారు. కాగా, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన విషయం విదితమే.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు, అధికారుల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక అధికారులు అరెస్ట్ అవ్వగా.. మాజీ ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే.