- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Harish Rao: గవర్నర్ ప్రసంగంలో దశ లేదు, దిశ లేదు

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగం(Governor's Speech)పై బీఆర్ఎస్(BRS) నేత హరీష్ రావు(Harish Rao) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు ఓ ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘గవర్నర్ ప్రసంగంలో దశ లేదు, దిశ లేదు. గతేడాది గవర్నర్ ప్రసంగానికి, ఈసారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదు. గవర్నర్లు మారారు తప్ప, ప్రసంగాలు మారలేదు. చేయనివి చేసినట్లు, ఇవ్వని ఇచ్చినట్లు అబద్దాలు, అవాస్తవాలతో కూడిన ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌తో చెప్పించింది. ఏడాదిన్నర ప్రభుత్వ పాలనా వైఫల్యానికి గవర్నర్ ప్రసంగం నిదర్శనం. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అబద్దాల ప్రచారాన్ని నమ్మించేందుకు గవర్నర్‌ని కూడా వాడుకోవడం సిగ్గుచేటు. నిజానికి రేవంత్ రెడ్డి అత్యుత్తమ మార్గం ఢిల్లీ సేవలో, చంద్రబాబు సేవలో నిమగ్నం అయ్యాడని తెలంగాణ ప్రజలు భావిస్తున్నరు. లగచర్ల, న్యాల్కల్, అశోక్ నగర్‌లో రైతులను, నిరుద్యోగులను పోలీసులతో కొట్టించడం, ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ఇదేనా మీరు చెప్పిన ట్రాన్స్ ఫార్మింగ్ లైవ్స్. ఇవ్వాళ కూడా ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేసి ప్రజాపాలన పేరిట పెద్ద ట్రాన్స్ ఫర్మేషన్ చేశారు’ అని హరీష్ రావు విమర్శించారు.
కాంగ్రెస్ అధికారం(Congress Govt)లోకి రాగానే తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టారు. వీటిని తెలంగాణ అభివృద్ధికి చేపట్టిన చర్యలుగా భావించాలా? అని ప్రశ్నించారు. రుణమాఫీ లేదు. రైతు భరోసా లేదు. రూ.2500 ఇవ్వట్లేదు. రైతు కూలీలకు రూ.12వేలు లేవు. ఇలా ఎన్నో హామీలు విస్మరించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 445 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. కనీసం రైతు బీమా డబ్బులు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలు తరలించుకుపోతున్నా.. పట్టించుకోవడం లేదని అన్నారు. గొప్పగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మొదటి గ్యారంటీ అయిన.. మహాలక్ష్మి(రూ.2500)కే దిక్కులేదని అన్నారు. ఇంకా దీనిని గేమ్ చేంజర్ అని చెప్పుకుంటున్నారని విమర్శించారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని చెప్పుకుంటున్న కులగణన సర్వే కూడా తప్పుల తడకగా ఉందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ చేసిన సర్వే మీద బీసీ సంఘాలే అనుమానం వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. ఎస్సీ వర్గీకరణ పూర్తి చేశాకే.. ఉద్యోగ నియమకాలు పూర్తి చేస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది ఇప్పటివరకు ముందడుగు పడలేదు అని చెప్పారు. రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలి వెళ్తుంటే కూడా పట్టించుకోని సోయి లేని ప్రభుత్వం ఇది అని మండిపడ్డారు.