- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ విషయంలో చర్చకు సిద్దమా హరీష్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన సవాల్

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నేతల (BRS) తెలివిని మ్యూజియంలో పెట్టాలని, 10 పెట్టి 20 సంపాదించాలనే ఆలోచన వాళ్లది.. ఇకనైనా బుద్ది మార్చుకోవాలని అని వరంగల్ పశ్చిమ (Warangal West) ఎమ్మెల్యే నాయిని రాజేందర్ (MLA Naini Rajendar) ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. బీఆర్ఎస్ నాయకులపై (BRS Leaders) విరుచుకుపడ్డారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో (Hanumakonda Congress Party Office) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కళ్లుండి చూడలేని కాబోది హరీష్ రావు అని, ఉద్యమాల జిల్లా, సమైక్య జిల్లాను మీ రాజకీయ ఉనికి కోసం 6 జిల్లాలుగా విభజించారని మండిపడ్డారు.
అలాగే సభ పేరుతో ఆలీబాబా చోర్ ముఠా వస్తుందని, బీజేపీ పార్టీకి కొమ్ముకాసే మీరు ఆత్మగౌరవం గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. అబద్ధాన్ని నిజం చేయటంలో కేటిఆర్, హరీష్ దిట్ట అని, మీరు కోవర్టు రాజకీయాలు చేసి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డే (CM Revanth Reddy) ఉంటారని, డైవర్షన్ పాలిటిక్స్ మానుకొవాలని సూచించారు. పదేళ్లలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, ప్రజలను మోసం చేయడానికి సభ పేరుతో దొంగల బ్యాచ్ వస్తుంది ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే వరంగల్ వచ్చిన ప్రతిసారి మమ్మల్ని మాటలతో మోసం చేశారని, దళిత బంధు పేరుతో, ట్రాక్టర్ ల పేరుతో, ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసింది మీరు కాదా అని నిలదీశారు.
అంతేగాక జీతం తీసుకుని ఫార్మ్ హౌజ్ లో ఉంటే ఎలా అని ముఖ్యమంత్రి ప్రశ్నిస్తే కేసీఆర్ (KCR) వస్తున్నాడు అని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయం మీకు వ్యాపారం లాంటిది అయితే, మాకు ప్రజా సేవలాంటిదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రమాదకరమైనదని, అధికారంకోసం ఎంతమందికైనా మోసం చేస్తారని, చేసేది తప్పులు.. చెప్పేది గొప్పలు అని దుయ్యబట్టారు. ఇక ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుస్తారని అనడం మానేసి ఎంపీ ఎన్నికల రిజల్ట్ పై సమీక్ష చేసుకోండి అంటూ.. పదేళ్ల మీ పాలన అభివృద్ధి, 15 నెలల మా పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా హరీష్ రావు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) ఛాలెంజ్ విసిరారు.