- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతా ఆమె కోసమే చేశా.. నవీన్ హత్య కేసు నిందితుడు హరిహరకృష్ణ
దిశ, వెబ్ డెస్క్: తన లవర్ ను ప్రేమిస్తున్నాడనే కోపంతో సొంత స్నేహితుడైన నవీన్ అనే యువకుడిని హరిహరకృష్ణ అనే మరో యువకుడు దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతుడి గుండె, కాలేయం, పేగులను బయటకి తీసి వాటిని ఫోటోలు తీసి తన ప్రియురాలికి పంపాడు. గత నెల (ఫిబ్రవరి 17)న జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హరిహరకృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి తమదైన శైలిలో ఇంటరాగేట్ చేయగా.. షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నవీన్ ను హత్య చేసింది తానొక్కడినేనని నిందితుడు ఒప్పుకున్నాడు. కానీ తాను ఆ హత్య తన ప్రియురాలు నిహారికరెడ్డి కోసమే చేశానని తేల్చి చెప్పాడు. లవ్ చేయాలని నిహారికను నవీన్ వేధించాడని, ఆ విషయాన్ని నిహారిక తనకు చెప్పిందని హరిహరకృష్ణ పోలీసుల విచారణలో వెల్లడించాడు.
ఈ క్రమంలోనే తాను నవీన్ ను హత్య చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. నవీన్ ను హత్య చేశాక ఆ ఫోటోలను నిహారికకు పంపానని, తన ఖర్చుల నిమిత్తం నిహారిక తనకు కొంత డబ్బును ట్రాన్స్ ఫర్ చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. హత్యకు సంబంధించిన ఫోటోలను తన మిత్రుడు హసన్ కు కూడా పంపానని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే నిందితుడి ప్రియురాలు నిహారిక, అతడి ఫ్రెండ్ హసన్ ను ఎల్బీ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య సమయంలో వారిద్దరూ అక్కడ లేకున్నప్పటికీ హత్యా సమాచారాన్ని పోలీసులకు చెప్పకుండా దాచిన నేరం కింద పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో హరిహరకృష్ణ ఏ 1గా ఉండగా.. తాజాగా హసన్ ను ఏ2గా, నిహారికను ఏ3గా చేర్చారు.
Also Read...
ఇంతదూరం వస్తుందనుకోలేదు.. ప్రీతి డెత్ కేసులో ‘సైఫ్’ సమాధానమిదే!