షటిల్ ఆడుతుండగా గుండెపోటు.. సీపీఆర్ చేసినా!(వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-06 06:47:51.0  )
షటిల్ ఆడుతుండగా గుండెపోటు.. సీపీఆర్ చేసినా!(వీడియో)
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : సాధారణంగా ఉన్న వ్యక్తులు అకస్మాత్తుగా గుండెపోటుకు గురై చనిపోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువ అయ్యాయి. తాజాగా ఇలాంటి సంఘటననే జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన బూస వెంకట రాజ గంగరాం (53) శుక్రవారం ఉదయం స్థానిక క్లబ్ లో షెటిల్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన స్నేహితులు గంగరాజం కు సిపిఆర్ చేసి ప్రథమ చికిత్స అందించారు. తర్వాత హాస్పిటల్ తరలించే క్రమంలో మార్గమద్యంలో మృతి చెందాడు. అప్పటివరకు బాగానే ఉండి ఉల్లాసంగా షెటిల్ ఆడుతున్న వ్యక్తి సడన్ గా హార్ట్ స్ట్రోక్ కు గురై చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు గా విలపిస్తున్నారు. ఈ విషాదం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed