Guns Sale Gang : హైదరాబాద్ లో తుపాకుల విక్రయ ముఠా అరెస్టు

by Y. Venkata Narasimha Reddy |
Guns Sale Gang : హైదరాబాద్ లో తుపాకుల విక్రయ ముఠా అరెస్టు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాదు(Hyderabad)లో తుపాకు(Guns)లు విక్రయించేందు(Sale)కు వచ్చినా ముఠా(Gang)ను రాచకొండ పోలీసు(Rachakonda Police)లు పట్టుకున్నారు. ముఠా నుంచి మూడు తుపాకులతో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన ముఠాగా పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలోని కీలక సూత్రధారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముఠా సభ్యులు ఎవరి కోసం గన్స్ తీసుకొచ్చారు..గన్స్ కోసం ఎవరైనా ఈ ముఠాని సంప్రదించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఠా గతంలో ఎవరికైనా గన్స్ విక్రయించారా అని కూడా ఆరా తీస్తున్నారు. ముఠా సభ్యులకు నగరంలో సంబంధాలు ఉన్నందునే వారు రాష్ట్రానికి గన్స్ అమ్మకానికి వచ్చారని భావిస్తున్న పోలీసులు ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

కాగా గత ఏడాది హైదరాబాద్‌లో నకిలీ గన్ లైసెన్స్‌లతో సొంతంగా తుపాకులు తయారుచేస్తూ అమ్ముతున్న మూఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 34 నకిలీ లైసెన్సులు, 33 తుపాకీలు, 140 రౌండ్స్ బులెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇతర రాష్ట్రాల నుంచి తుపాకులు తీసుకొచ్చి ఇక్కడ నకిలీ లైసెన్సుతో అమ్మకాలు చేస్తున్నట్లుగా గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed