Gruha Jyothi Scheme: జీరో కరెంట్ బిల్లు రాలేదని బాధపడుతున్నారా?.. ఇలా చేస్తే మీకు జీరో బిల్లు రావడం పక్కా

by Shiva |   ( Updated:2024-03-13 08:26:52.0  )
Gruha Jyothi Scheme: జీరో కరెంట్ బిల్లు రాలేదని బాధపడుతున్నారా?..  ఇలా చేస్తే మీకు జీరో బిల్లు రావడం పక్కా
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతోంది. ఈ మేరకు లబ్ధిదారుకు విద్యుత్ సిబ్బంది జీరో కరెంట్ బిల్లులను కూడా అందజేశారు. అయితే, కొందరు గృహ‌జ్యోతి పథకానికి అర్హులుగా ఉన్నప్పటికీ వారికి జీరో బిల్లులు అందలేదు. ఈ క్రమంలో చాలా మంది లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. తమకు పథకం అందలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అలాంటి వారికి విద్యుత్ శాఖ అధికారులు కీలక సూచన చేస్తున్నారు.

అందరికీ గృహలక్ష్మి పథకం అమలు అవుతుందని, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అర్హలుగా ఉండి జీరో బిల్ అందని వారు తమ కరెంట్ బిల్లు, ఆధార్ కార్డు జిరాక్స్, ప్రజా పాలన దరఖాస్తు నంబర్, రేషన్ కార్డుతో స్థానిక ఎంపీడీవో కార్యాలయాల్లో సంప్రదించాలని కోరుతున్నారు. ఆయా కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో వివరాలను నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. లబ్ధిదారులు తమ వివరాలను నమోదు చేయించిన తరువాత వాళ్లి్చ్చే రశీదును విద్యుత్ సిబ్బందికి అందించి జీరో బిల్లును పొందాలని స్పష్టం చేశారు.

Advertisement

Next Story