Group-2 Preliminary Key: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. గ్రూప్-2 ప్రిలిమినరీ కీ విడుదల

by Shiva |   ( Updated:2025-01-18 06:16:24.0  )
Group-2 Preliminary Key: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. గ్రూప్-2 ప్రిలిమినరీ కీ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 782 పోస్టుల భర్తీకి గాను టీజీపీఎస్‌సీ (TGPSC) గత సంవత్సరం డిసెంబర్ 15, 16 తేదీల్లో రాత పరీక్ష (Written Test)లను నిర్వహించింది. ఈ మేరకు ఇవాళ ఆ పరీక్షలకు సంబంధించి ప్రిలిమినరీ కీ (Preliminary Key)ని అధికారులు విడుదల చేశారు. అదేవిధంగా ప్రిలిమినరీ కీతో పాటు ప్రధాన ప్రశ్నా పత్రాన్ని (Master Question Paper) ఈనెల 22 వరకు టీజీపీఎస్‌సీ వెబ్‌సైట్‌ (TGPSC Website)లో అందుబాటులో ఉంటుందని టీజీపీఎస్‌సీ బోర్డు సెక్రటరీ నవీన్ నికోలస్ (Naveen Nicholas) వెల్లడించారు.

అవసరం ఉన్న అభ్యర్థులు వాటిని ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. ప్రిలిమినరీ కీ (Preliminary Key)లో ఏమైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో ఈ నెల 18 నుంచి 22 సాయంత్రం 5 గంటల లోపు ఆన్‌లైన్ నమోదు చేయాలని సూచించారు. ఇన్‌టైమ్‌లో అందిన అభ్యంతరాలను మాత్రమే తాము పరిగణలోకి తీసుకుంటామని ఆ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని నవీన్ నికోలస్ స్పష్టం చేశారు.



Next Story

Most Viewed