TS: గ్రూపు-1 ప్రిలిమ్స్‌ కొత్త పరీక్ష తేదీలు ఖరారు

by GSrikanth |
TS: గ్రూపు-1 ప్రిలిమ్స్‌ కొత్త పరీక్ష తేదీలు ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష సహా మరో రెండు పరీక్షలను రద్దు చేసింది. త్వరలో జరగాల్సిన పరీక్షలను కూడా వాయిదా వేసింది. టీఎస్‌పీఎస్సీ నుంచి ఎగ్జామ్ పేపర్స్ లీక్ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దాంతో టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా.. గ్రూపు-1 ప్రిలిమ్స్‌ కొత్త పరీక్ష తేదీని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. జూన్ 11వ తేదీన నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

Advertisement

Next Story