Group 1 Mains Result : గ్రూప్-1 ఫలితాలు విడుదల

by D.Reddy |   ( Updated:2025-03-10 09:09:24.0  )
Group 1 Mains Result : గ్రూప్-1 ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ గ్రూప్‌-1 ఫలితాలను (Results) తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) సోమవారం విడుదల చేసింది. మొత్తం 563 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థుల ప్రాథమిక మార్కుల (Preliminary Marks) వివరాలను వెల్లడించింది. అలాగే, గ్రూప్‌-2 అభ్యర్థుల జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితా మార్చి 11న, గ్రూప్‌- 3 పరీక్ష జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాను (General Rankings) మార్చి 14న విడుదల TGPSC విడుదల చేయనుంది.

ఇక TGPSC ప్రకటించిన ప్రాథమిక జాబితాలో వచ్చిన మార్కులపై సందేహాలున్న అభ్యర్థులు 15 రోజుల్లోగా ఒక్కో పేపర్‌కు రూ. 1000 చొప్పున చెల్లించి రీ కౌంటింగ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్‌పై అభ్యంతరాలు స్వీకరించి, ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే 1:2 నిష్పత్తిలో తుది జాబితాను రిలీజ్ చేయనుంది. కాగా, గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకూ గ్రూప్-1 మెయిన్‌ పరీక్షలు జరిగాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 31,383 మంది క్వాలిఫై అయినప్పటికీ.. మెయిన్స్‌ పరీక్షలకు మాత్రం 21,093 మంది హాజరయ్యారు.

అలాగే, గ్రూప్‌-1 ఫలితాల విడుదలలో అనేక న్యాపరమైన సమస్యలు ఎదురైన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నెల క్రితం దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేయడంతో ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. గతంలో కొంతమంది అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. వారి పిటిషన్లు న్యాయస్థానం కొట్టివేసింది. అనంతరం వారు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, తెలంగాణ ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ఆ పిటిషన్లను కొట్టివేసింది.

ఫలితాల కోసం వెబ్‌సై‌ట్‌ https://www.tspsc.gov.in/ ను సందర్శించండి.

Next Story