Aadi Srinivas: ఆ రోజు బీఆర్ఎస్ కు బీసీలపై మీ ప్రేమ ఏమైంది?: ఆది శ్రీనివాస్

by Prasad Jukanti |   ( Updated:2025-02-04 07:45:07.0  )
Aadi Srinivas: ఆ రోజు బీఆర్ఎస్ కు బీసీలపై మీ ప్రేమ ఏమైంది?: ఆది శ్రీనివాస్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీసీలపై బీఆర్ఎస్ (BRS) మొసలి కన్నీరు కారుస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) విమర్శించారు. గతంలో ఒక్కరోజు సర్వే చేసి నివేదిక బయట పెట్టని పార్టీ నేడు బీసీ కుల గణనపై మాట్లాడుతున్నదని ఎద్దేవా చేశారు. ఇవాళ శాసనసభ వాయిదా అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన.. స్పీకర్ అనుమతితో సభ వాయిదా పడిందని దీనిపై బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల్లో 34% ఉన్న బీసీల రిజర్వేషన్లు (BC Reservations) 29% శాతానికి తగ్గించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని ఆ రోజు బీసీలపై మీకున్న చిత్తశుద్ధి ఏమైందని ప్రశ్నించారు. మీలా నలుగురు నాలుగు గోడల మధ్య మాట్లాడి సభ ముగించే పద్దతి మాది కాదని మీరు అటకెక్కించిన కుల గణనలో 51 శాతం బీసీలు ఉంటే మా కుల గణనలో 56 శాతం బీసీలు ఉన్నారన్నారు. అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ ను కోరుతామన్నారు.



Next Story

Most Viewed