- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగుల ఆరోగ్య పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి : మంత్రి సీతక్క
దిశ, ములుగు ప్రతినిధి: ఉద్యోగుల ఆరోగ్య పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని, ములుగు జిల్లాలో శనివారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి క్రీడోత్సవలను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… అత్యధిక స్థాయి లో క్షేత్ర స్థాయి ఉద్యోగులు ఉన్న మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ కు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం నాకు ఎంతో సంతోషకరం అని అన్నారు. మన ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం అని అన్నారు. అంగన్వాడీ టీచర్లు & ఆయాలు మా ఆడబిడ్డలు, ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డలకు ఆపన్న హస్తం, వారి ఆరోగ్యం సంరక్షణ లో ఆత్మీయ నేస్తం అని అన్నారు.
అధికశాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్న మన శాఖలో రాష్ట్రం లో మాతా, శిశు మరణాలు తగ్గించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా క్షేత్రస్థాయి లో ఎన్నో కష్టనష్టాలకోర్చి గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువులకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తూ వారి మెరుగైన జీవనానికి పాటుపడుతున్న అంగన్వాడీ టీచర్లు & ఆయాలకు సరైన గుర్తింపు ఇవ్వాలని, ఎన్నో ఏండ్ల నాటి నుండి పనిచేస్తున్న వారికి ప్రభుత్వం తరపున సరైన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో వారికి రిటైర్మెంట్, ఇతర ప్రయోజనాలు అందించే ఉద్దేశ్యంతో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడం జరిగిందని త్వరలోనే అవి అమల్లోకి వస్తాయని అన్నారు.
ఏ నిర్ణయాలు తీసుకున్నా ఉద్యోగుల ఆరోగ్యాన్ని మించిన అంశం మరేదీ లేదనే ఉద్దేశం తో మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ & గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా ఈ ముందస్తు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని రాష్ట్రం లో మొట్ట మొదటి సారిగా ములుగు జిల్లాలోనే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్యాన్సర్ ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదని, దాన్ని ముందస్తు పరీక్షలు చేసుకొని ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితులు నుండి బయటపడవచ్చని అన్నారు.
జిల్లా స్థాయి క్రీడోత్సవలలో మంత్రి మాట్లాడుతూ అవయవాలు పని చేస్తే లేవని ఆవేదన చెందకుండా క్రీడలలో, ఉద్యోగ రంగాలలో రాణించాలని కోరారు. గత పాలకులు దివ్యాంగుల సంక్షేమం కోసం 10 కోట్ల రూపాయలను కేటాయించగా నేటి ప్రజా ప్రభుత్వం 50 కోట్లను కేటాయించిందని, ఇప్పటికే వికలాంగులకు పలు రకాల వాహనాలు అందిస్తుండగా రానున్న రోజులలో వారు వ్యాపారాలు చేసుకుని అభివృద్ధి చెందడానికి మోడల్ వాహనాలు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శిరీష, ఎస్సీ కార్పొరేషన్ ఈ డి తూల రవి, దివ్యాంగుల సంఘాల నాయకులు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.