- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గౌడ కులస్తుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది : నిరంజన్ రెడ్డి
దిశ, వనపర్తి : గౌడ సంఘం సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర గౌడ సంఘం కన్వీనర్ పలుస రమేష్ గౌడ్, రాష్ట్ర కో - కన్వినర్ సురేష్ గౌడ్, జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు బండారు శ్రీనివాస్ గౌడ్, జిల్లా నాయకులు పలుస కృపానంద్ గౌడ్, కౌన్సిలర్ సుధా మధు సుధన్ గౌడ్, లక్ష్మి దేవమ్మ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నీ కలిసి శ్రీరామ నవమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో భాగంగా గౌడ సంక్షేమం కోసం వనపర్తి జిల్లా గౌడ సంఘం నాయకులకు విజ్ఞప్తి మేరకు జిల్లా కేంద్రంలోని పాన్ గల్ వెళ్లే రోడ్డులో గౌడ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, ప్రొఫెషనల్ సంఘం కమ్యూనిటీ భవన నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు చేస్తామన్నారు. గౌడ కుల దేవత ఎల్లమ్మ దేవాలయ నిర్మాణం, జిల్లా లోని పేద గౌడ విద్యార్థుల కోసం వసతి గృహం నిర్మాణానికి రెండు ఎకరాల భూమిని కేటాయిస్తామన్నారు. త్వరలో జిల్లా కేంద్రంలోని సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహం ప్రతిష్ట చేయడానికి అనువైన స్థలం కేటాయిస్తాయని, ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
ఈ సందర్భంగా జిల్లా గౌడ సంఘం నాయకులు 200 మంది గౌడ కులస్తులతో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు జామ శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి పార్థ సారధి గౌడ్, ఉద్యోగ సంఘం నాయకులు మనోహర్ గౌడ్, కృష్ణ గౌడ్, డి.ఆర్ గౌడ్, వెంకటేష్ గౌడ్, ఎలక్ట్రిసిటీ ఏఈ రాజా గౌడ్, ఉపాధ్యాయులు రవీందర్ గౌడ్, మేఘా శ్యామ్ గౌడ్, రవీందర్ గౌడ్, నాగేంద్రం గౌడ్, నాగరాజు గౌడ్, ఈశ్వరయ్య గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సురేందర్ గౌడ్, భాస్కర్ గౌడ్, రామన్ గౌడ్, వనపర్తి గీత కార్మిక పారిశ్రామిక సంఘం అధ్యక్షులు రామస్వామి గౌడ్, రామన్ గౌడ్, వెంకటయ్య గౌడ్, పురుషోత్తం గౌడ్, వామన్ గౌడ్, నరేందర్ గౌడ్, వినోద్ గౌడ్, మురళీధర్ గౌడ్, రాజేందర్ గౌడ్, శివన్న గౌడ్, కృష్ణ గౌడ్, రమేష్ గౌడ్, గౌడ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు పలుస శ్రీకర్ గౌడ్, నాయకులు పలుస రాఘవేందర్ గౌడ్, రాజేష్ గౌడ్, అనిల్ గౌడ్, కార్తీక్ గౌడ్, పీపీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.