గౌడన్నల దేశభక్తి.. ఆకాశంలో అద్భుతం

by GSrikanth |
గౌడన్నల దేశభక్తి.. ఆకాశంలో అద్భుతం
X

దిశ, తిరుమలాయపాలెం: 75వ భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో గౌడన్నలు వినూత్నంగా జాతీయ జండాకు వందనం చేశారు. సోమవారం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామంలోని తాటి వనంలో గ్రామానికి చెందిన గౌడన్నలు బి.వెంకన్న, సర్వయ్య, వెంకన్న, నర్సయ్య, బాబు, వీరభద్రం, శ్రీను, ఉప్పలయ్య, భిక్షం, శ్రీనివాస్, సురేందర్ అనే కల్లు గీత కార్మికులు జాతీయ జెండాలతో తాటిచెట్టు పైకి ఎక్కారు. చెట్టుపైనే గౌడన్నలు జాతీయ జండాలు ప్రదర్శించి తమ దేశ భక్తిని చాటుకున్నారు. వినూత్న రీతిలో జాతీయ జెండాలు ప్రదర్శించగా, చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తాటి వనానికి చేరుకున్నారు. తాటి చెట్టుపై జాతీయ జెండా రెపరెపలాడగా, చూడడానికి ఎంతో అద్భుతం అని ప్రశంసించారు.

Advertisement

Next Story

Most Viewed