శ్రీ రామనవమి ఊరేగింపులో బాంబులు విసిరేందుకు ప్లాన్: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
శ్రీ రామనవమి ఊరేగింపులో బాంబులు విసిరేందుకు ప్లాన్: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ వైపు శ్రీరామనవమి వేడుకలకు భాగ్యనగరం ముస్తాబవుతుండగా.. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా తనను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద సంస్థ దాడికి ప్లాన్ చేసిందని రాజాసింగ్ ఆరోపించారు. మార్చి 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, రాష్ట్ర బీజేపీ కార్యాలయం, రామనవమి ఊరేగింపుపై బాంబులు విసిరేందుకు ఓ ఉగ్రవాది ప్లాన్ చేశాడంటూ, హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఉమామహేశ్వరి అనే పేరుతో పోలీస్ కమిషనర్‌కు రాసిన లేఖను సోషల్ మీడియాతో పోస్ట్ చేశాడు.

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రధాన లక్ష్యంగా బహ్రెయిన్‌లోని ముఖ్తార్ బ్రిగేడ్స్‌లో పనిచేస్తున్న ఉగ్రవాది కుట్రకు యత్నిస్తున్నారని ఉమా మహేశ్వరి రాసిన లేఖలో ఆరోపించారు. అయితే, నవమి ఊరేగింపుకు రాజాసింగ్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనపై ఉగ్రకుట్ర చేసేందుకు యత్నిస్తున్నారన్న వార్త సంచలంగా మారింది. దీనిపై రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ, పోలీసు కమిషనర్‌లు లేఖలో చేసిన వాదనలను ధృవీకరించారా అని అడిగారు. ఈ ఊరేగింపులో లక్షలాది మంది రామభక్తులు పాల్గొంటున్నందున తమకు అప్‌డేట్ ఇవ్వాలని రాజాసింగ్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story