- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీజేపీకి గుడ్ బై.. టీఆర్ఎస్‌లోకి మాజీ ఎంపీ
దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నిక వేళ బీజేపీకి మరో కీలక నేత గుడ్‌బై చెప్పడానికి సిద్ధమయ్యారు. మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. చేనేతల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోన్న కృషిని అభినందించారు. అంతేగాక, బీజేపీకి రాజీనామా చేయబోతున్నానని, అతి త్వరలో టీఆర్ఎస్‌లో చేరబోతున్నానని ప్రకటించారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధింపును వ్యతిరేకిస్తున్నానని చెప్పిన రాపోలు.. చేనేత సంక్షేమానికి కేసీఆర్ సర్కార్ చర్యలు అద్భుతమని వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కారు చేనేత రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని.. ఇది నేత కార్మికుల ఆర్థికాభివృద్ధికి ప్రతిబంధకంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన తాను చేనేతల అభివృద్ధిని దెబ్బతీసేలా చేస్తోన్న బీజేపీ నిర్వాకాన్ని చూస్తూ ఇంకా భరించలేనని అన్నారు. అందుకే తాను బీజేపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతానని తెలిపారు. కాగా, మునుగోడు ఉప ఎన్నిక సమీపిస్తోన్న నేపథ్యంలో ఇప్పటికే మాజీ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్, బూడిద భిక్షమయ్య గౌడ్‌లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిబాటలోనే రాపోలు ఆనంద్ భాస్కర్ కూడా చేశారు.
ఇవి కూడా చదవండి : సమయం లేదు మిత్రమా.. నెక్స్ట్ లెవల్‌కు మునుగోడు ప్రచారం