శాసనమండలి రద్దు ఖాయం.. గోనే ప్రకాశ్ సెన్సేషనల్ కామెంట్స్

by Prasad Jukanti |
శాసనమండలి రద్దు ఖాయం.. గోనే ప్రకాశ్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో శాసనమండలి చెల్లుబాటు కాదని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు అన్నారు. కనీసం 120 మంది ఎమ్మెల్యేలు ఉంటే తప్ప మండలి ఏర్పాటు చేయడం కుదరదని, కానీ ప్రస్తుతం ప్రస్తుతం తెలంగాణలో ఉన్నది 119 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అని అన్నారు. ఈ అంశంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానని, కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేస్తానని చెప్పారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేరికలపై ప్రకాశ్‌రావు హాట్ కామెంట్స్ చేశారు. చేరికలు కాంగ్రెస్‌కు అప్రతిష్ఠ తెస్తాయన్నారు. ఈ విషయంలో కోర్టుకు వెళ్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, అప్పుడు పార్టీ మారిన వారిపై అనర్హత వేటు పడుతుందన్నారు. 2/3 వంతు ఉంటే తప్ప విలీనం సాధ్యం కాదన్నారు.

బీఆర్ఎస్ పుట్టుకే అక్కడి నుంచి..

గతంలో దశలవారీగా ఎమ్మెల్యేలను చేర్చుకుని ప్రతిపక్షాలను చీల్చిన చరిత్ర కేసీఆర్‌ది అని ప్రకాశ్‌రావు ధ్వజమెత్తారు. అసలు బీఆర్ఎస్ పుట్టుకే పార్టీ ఫిరాయింపుల నుంచి మొదలైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014-18 వరకు, 2018-2023 వరకు శాసనసభ స్పీకర్లుగా పని చేసిన మధుసూదనాచారి, పోచారం శ్రీనివాసరెడ్డి అనైతికంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story