Accident: కుంభమేళాకు వెళ్లి తిరిగిరాని లోకాలకు..

by D.Reddy |   ( Updated:2025-02-24 05:22:29.0  )
Accident: కుంభమేళాకు వెళ్లి తిరిగిరాని లోకాలకు..
X

దిశ, వెబ్‌డెస్క్: మహా కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదం ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పొగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా వేడుక ఘనంగా జరుగుతుంది. ఈ వేడుకలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ కుంటుబం కారులో మహా కుంభమేళాకు వెళ్లింది. అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి తిరుగు పయనమయ్యారు. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే జరిగింది.

ఇంతలోనే దురదుష్టవశాత్తూ ఘోర ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొనటంతో ప్రమాదం జరిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతుల్లో జహీరాబాద్‌ ఇరిగేషన్‌ డీఈ వెంకటరామిరెడ్డి, ఆయన భార్య విలాసిని, కారు డ్రైవర్‌ న్యాల్‌కల్‌ మండలానికి చెందిన మల్లారెడ్డి ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed