G.O 46 : జీవో 46 రద్దవుడో- చచ్చుడో.. ప్రజా భవన్ ముందు బాధితుల నిరసన

by Ramesh N |
G.O 46 : జీవో 46 రద్దవుడో- చచ్చుడో.. ప్రజా భవన్ ముందు బాధితుల నిరసన
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రజాభవన్ వద్ద జీవో 46 బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సక్రమంగా నిర్వహించేందుకు జారీ చేసిన జీవో నంబర్‌ 46ను రద్దు చేయాలని ఇవాళ హైదరాబాద్‌లోని జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ వద్ద బాధిత అభ్యర్ధులు బైఠాయించి.. నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జీవో 46 రద్దవుడో లేదా చచ్చుడో అంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వం గతంలో ఉద్యోగ భర్తీలో జీవో నంబర్‌ 46ను జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రద్దు చేస్తామని తమకు హామీ ఇచ్చిందని, హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో జీవో నెంబర్ 46 గురించి ఎవరూ కూడా మాట్లాడటం లేదని, తమకు న్యాయం చేయాలని మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జీవో 46 రద్దు చేయాలని ప్రజాభవన్‌లో ఉండే అధికారులకు అభ్యర్థులు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed

    null