Musi River : మూసీ నది ప్రక్షాళనలో GHMC కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |
Musi River : మూసీ నది ప్రక్షాళనలో GHMC కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: మూసీ నది ప్రక్షాళనలో భాగంగా గ్రేటర్ హైదరబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) కీలక నిర్ణయం తీసుకుంది. నిర్వాసితులకు అండగా ఉండేందుకు సిబ్బందిని నియమించుకున్నది. ప్రస్తుతం 14 మంది హౌసింగ్ సిబ్బందిని నియమిస్తూ శుక్రవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, మూసీ రివర్ బెడ్లో, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్న ఇళ్లను తొలగింపునకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని హామీ సైతం ఇచ్చారు. ఇప్పటికే కూల్చబోయే ఇళ్ల విషయంలో అధికారుల సర్వే పూర్తి అయిందని అన్నారు. ఆ సర్వేలో పదమూడు వేల ఇండ్లు ఉన్నట్టు గుర్తించామని వాటిని తొలగిస్తామన్నారు. మూసీ పరిసర ప్రాంతాల తహసీల్దార్లతో హైదరాబాద్ కలెక్టర్ మీటింగ్ ఉంటుందని వివరించారు. మూసీ పరివాహక ప్రాంత ఇళ్లకు అతి త్వరలో అధికారులు నోటీసులు జారీ చేస్తారని తెలియజేశారు.

Advertisement

Next Story