- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
GADDAM PRASAD: బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత హరీశ్ రావే.. స్పీకర్ హాట్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం అవుతున్నది. ఈ నెల 23 న అసెంబ్లీ సెషన్ ప్రారంభం కాబోతున్నదని ఇప్పటికే గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఈసారైనా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనేదానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీ కి రావాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. తాజాగా ఓ న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన స్పీకర్.. 10 ఏళ్లు ఈ తెలంగాణను పరిపాలించిన కేసీఆర్ సంపూర్ణమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి అని వారు వస్తే నేను సంతోషిస్తానన్నారు. కేసీఆర్ సభకు వచ్చి తన సూచనలు చేస్తే స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు చెప్పారని గుర్తు చేశారని తాను కూడా మనస్ఫూర్తిగా కేసీఆర్ సభకు రావాలని ఆహ్వానిస్తున్నానన్నారు.
కేసీఆర్ తర్వాత హరీశ్ రావే:
కేటీఆర్ తో ఉన్న స్నేహం వల్ల బీఆర్ఎస్ నేతలకు అపాయింట్ మెంట్ ఇచ్చి బీజేపీ వాళ్లకు ఇవ్వలేదనే విమర్శలను స్పీకర్ ఖండించారు. ఇది అవాస్తవం అన్నారు. తనకు ఫోన్ చేసింది కేటీఆర్ కాదని హరీశ్ రావు ఫోన్ చేసి రిప్రజెంటేషన్ ఇస్తామని కోరారన్నారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత హరీశ్ రావు కీలక నేత అని సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు చాలా అనుభవం కలిగిన నేత, రాజకీయంగా అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి ఆయన ఫోన్ చేసి తమ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ విషయంలో జరుగుతున్న అన్యాయంపై వినతిపత్రం ఇస్తామని అపాయింట్మెంట్ అడగడంతో అపాయింట్ మెంట్ ఇచ్చాన్ననారు. కేటీఆర్ విషయంలో స్నేహితుడే అయినా స్పీకర్ కు మిత్రుడికి సంబంధం లేదన్నారు. పార్టీ ఫిరాయింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాననేది రాబోయే రోజుల్లో తెలుస్తుందన్నారు. వ్యక్తిగతంగా పార్టీ ఫిరాయింపులకు తాను వ్యతిరేకం అన్నారు.