- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తరచూ గుండెపోటు మరణాలు.. ఇలా చేయాలంటున్న సైంటిస్ట్‌లు
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల తరచూ గుండెపోటు కారణంగా వయసుతో నిమిత్తం లేకుండా మరణాలు చూస్తున్నాం. ఆరోగ్యంగా కనిపించిన వ్యక్తులు సైతం గుండెపోటు బారిన పడి తనువు చాలిస్తున్నారు. నిర్మల్‌లో డ్యాన్స్ చేస్తూ యువకుడు, హైదరాబాద్‌లో జిమ్ చేస్తూ ఓ కానిస్టేబుల్, నిన్న షటిల్ ఆడుతూ సికింద్రాబాద్‌లో ఓ వ్యక్తి చనిపోయారు. వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి.
అయితే రోజూ 11 నిమిషాలు లేదా వారానికి 75 నిమిషాలు వేగంగా నడిస్తే గుండెజబ్బు, పక్షవాతంతో పాటు పలు క్యాన్సర్ల ముప్పును తగ్గించుకోవచ్చని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. యూకేకు చెందిన జాతీయ ఆరోగ్య సేవ సూచించిన మేరకు శారీరక శ్రమలో కనీసం సగం చేసినా.. ప్రతి పది అకాల మరణాల్లో ఒక దాన్ని నివారించవచ్చని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనంలో పరిశోధకులు తేల్చారు.
పెద్దలు వారంలో కనీసం 150 నిమిషాలు ఓ మోస్తరు నుంచి తీవ్రస్థాయి వరకు లేదా 75 నిమిషాలు అత్యంత తీవ్ర స్థాయి శారీరక శ్రమ చేయాలని ఎన్‌హెచ్‌ఎస్ సిఫారసు చేసింది. అసలేమీ చేయకపోవడం కన్నా ఎంతో కొంత శ్రమ వల్ల మేలు కలుగుతుందని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో వైద్య పరిశోధన మండలి విభాగానికి చెందిన డాక్టర్ సోరెన్ బ్రేజ్ పేర్కొన్నారు. వర్సిటీ జరిపిన అధ్యయనంలో వారానికి 75 నిమిషాల ఓ మోస్తరు శారీరక శ్రమ గుండె వ్యాధుల ముప్పును 17 శాతం, క్యాన్సర్ల ముప్పును 7 శాతం తగ్గిస్తుందని తేలింది.