Formula E-Race: ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం.. ఆ సంస్థకు ఏసీబీ నోటీసులు

by Shiva |   ( Updated:2025-01-25 07:27:07.0  )
Formula E-Race: ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం.. ఆ సంస్థకు ఏసీబీ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఫార్ములా ఈ-రేసు కేసు (Formula- E Race)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే కేసులో ఓ వైపు ఈడీ (Directorate of Enforcement).. మరో వైపు ఏసీబీ (ACB) అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా, ఏసీబీ అధికారులు ఎఫ్ఈవో కంపెనీ (FEO Company) యాజమాన్యానికి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. విచారణలో భాగంగా హెచ్ఎండీఏ (HMDA) ఖాతా నుంచి ఎఫ్‌ఈవో కంపెనీ (FEO Company)కి రూ.50 కోట్లకు పైగా నిధులు బదిలీ అయినట్లుగా తేలింది. నిజాలను నిగ్గు తేల్చే పనిలో భాగంగా ఆ కంపెనీ సీఈవోకు ఏసీబీ అధికారులు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. అనంతరం సీఈవో ఇచ్చే స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డ్ చేయనున్నారు. అయితే, నోటీసులు అందుకున్న ఎఫ్‌ఈవో యాజమాన్యం విచారణ హాజరయ్యేందుకు మరో నాలుగు వారాల సమయం ఇవ్వాలని అభ్యర్థించినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.

కాగా, కేసులో A1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ స్టేట్‌మెంట్‌ను ఏసీబీ అధికారులు ఇప్పటికే రికార్డ్ చేశారు. అదేవిధంగా A2 బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మునిసిపల్, పట్టణాభివృద్ధి స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్ (Arvind Kumar), A3 హెచ్ఎండీ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి (BLN Reddy)‌లను వాంగ్మూలాన్ని ఏసీబీ రికార్డ్ చేసింది. ఈ నెల 18న ఫార్ములా ఈ-రేసు నిర్వహణకు సంబంధించి గ్రీన్ కో, ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీ ప్రతినిధుల స్టేట్‌మెంట్లను సైతం అధికారులు రికార్డు చేశారు.

Next Story

Most Viewed