- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఒరిజినల్ వీడియోలను జీవన్ రెడ్డికి పంపుతున్నాం: వినోద్ కుమార్

దిశ, వెబ్‌డెస్క్: గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల తెలంగాణలోని ఏడు మండలాలు ఏపీలో కలిశాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా.. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడొద్దని హితవు పలికారు. ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిపినప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడలేదు అనడం దారుణమని అసహనం వ్యక్తం చేశారు. తాము ఆనాడు లోక్‌సభలో మాట్లాడిన వీడియోలను జీవన్ రెడ్డికి పంపుతున్నాము అని వినోద్ కుమార్ తెలిపారు. ఆనాడు రాజ్యసభలో మెజార్టీ ఉన్న కాంగ్రెస్ నాయకులు దానికి అడ్డుపడలేదని గుర్తుచేశారు. జీవన్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మరోసారి డిమాండ్ చేశారు.