- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీసీ కుల గణన జరగకపోతే ప్రజలే బుద్ది చెబుతారు.. మాజీ ఎంపీ
దిశ, తెలంగాణ బ్యూరో: “మీరు బీసీ నాయకులైతే.. కుల గణనకు సహకరించండి. లేదంటే ప్రజలే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది” అంటూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్..బీజేపీ ఎంపీలు, లక్ష్మణ్, బండి సంజయ్లకు బుధవారం లేఖ రాశారు. జాతీయ స్థాయిలో ఓబీసీ నాయకులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్షణ్ , బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ ఇలా.. ఢిల్లీ నుండి తెలంగాణ గల్లీ వరకు అంతా బీసీ నాయకులే ఉన్నందున జాతీయ స్థాయిలో కుల గణనకు ఆటంకం ఉండదని పేర్కొన్నారు. మోదీ, షాలకు ఇబ్బంది ఉంటే స్వయంగా మీరిద్దరే ఒప్పించాలని బండి, లక్ష్మణ్లకు సూచించారు.
లేదంటే బీసీలను నిట్టనిలువుగా ముంచి వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోతారని స్పష్టం చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే కూడా మోడీకి లేఖ రాసినట్లు పొన్నం గుర్తు చేశారు. 2011-12లో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సామాజిక, ఆర్థిక కుల గణన చేశామని, ఇప్పుడు బీసీ గణన చేసే అదృష్టం బీజేపీకి వచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని మిస్చేసుకుంటే బీసీ నాయకులుగా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని పొన్నం ఫైర్అయ్యారు.