- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్‌కు సినిమా వాళ్లతో చాలా పనులుంటాయ్: రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ కవితపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తన అన్న, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుబాయ్, అమెరికా, సింగపూర్‌లలో వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించడంలో బిజీగా ఉన్నారని, ఆయనకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో చాలా పనులుంటాయని, అందుకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఒక బీసీ నేతకు అవకాశం ఇవ్వండని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్‌కు బడుగులు, బలహీనులు, దళితులు గుర్తుకు రాలేదని, కవితకు పూలే ఇప్పుడు గుర్తుకు వచ్చాడా? బీసీలను ఇన్నిరోజులు ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు.
కవితకు వీలైతే ఫాంహౌజ్‌లో తండ్రిని కలిసి తమకు ఒక ఎంపీ సీటు వస్తుందని చెప్పాలని పేర్కొన్నారు. ఆమెకు బడుగు, బలహీనవర్గాలపై ప్రేమ ఉంటే శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇవ్వమని అడగాలన్నారు. శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇచ్చి పాపాలు కడుక్కోవాలని విమర్శలు చేశారు. బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఎవరెవరికి అమ్ముకున్నారో అందరికీ తెలుసని కవితపై ఆయన విమర్శలు చేశారు. కేసీఆర్ ఆరోగ్యం ఎలాగూ సహకరించడం లేదని, నడిచే పరిస్థితి లేదు కాబట్టి ఫ్లోర్ లీడర్‌గా సీనియర్ అయిన, దళితుడు అయిన కడియం శ్రీహరికి అవకాశం ఇవ్వాలని కవిత అడగాలని సూచించారు.
ఇప్పటికి కూడా కవితకు, కల్వకుంట్ల ఫ్యామిలీకి పబ్లిసిటీ పిచ్చి ఎందుకని రఘునందన్ రావు ప్రశ్నించారు. శాసనసభలో కేటీఆర్, హరీశ్ రావు, తెలంగాణ భవన్ కేసీఆర్, మండలిలో కవిత ఇప్పటికే కనిపిస్తున్నారని, బీఆర్ఎస్‌లో వీరు తప్పితే మాట్లాడే వాళ్ళు నేతలే పార్టీలో లేరా? అని ఆయన నిలదీశారు. కేసీఆర్ కాళ్ళు మొక్కుతావో.. ఏం చేస్తావో తెలియదు కానీ, కొద్దిరోజులు కల్వకుంట్ల కుటుంబం మొత్తం మాట్లాడకుండా, మీడియా ముందుకు రాకుండా ఉంటే వారికే మంచిదని కవితకు సూచించారు. బీఆర్ఎస్‌తో పార్టీ పేరులో ఎలాగూ తెలంగాణ పోయిందని, కనీసం సీట్లు అయినా తెలంగాణ కోసం కొట్లాడిన వారికి ఇవ్వండని రఘునందన్ రావు సూచించారు.