Phone Tapping Case: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తికి నోటీసులు.. స్పందించిన జగదీష్ రెడ్డి

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-12 11:11:55.0  )
Phone Tapping Case: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తికి నోటీసులు.. స్పందించిన జగదీష్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone tapping case)లో బీఆర్ఎస్ నేత, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(Chirumarthi Lingaiah)కు పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్న తిరుపతన్నతో లింగయ్య కాంటాక్ట్‌లో ఉండటంతో నోటీసులు జారీ చేశారు. తాజాగా.. ఈ నోటీసులపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) స్పందించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం ఎవిడెన్స్ కోసమే తమ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు.

దానికి మా మాజీ ఎమ్మెల్యేలు సమాధానం ఇస్తారు అని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అయినా తామేం భయపడే వాళ్లం కాదని అన్నారు. మహారాస్ట్ర ఎన్నికల్లో ఎవరు గెలిస్తే మాకు ఏంటి...? ఓడితే మాకు ఏంటి అని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని అంటున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వాల్మీకి స్కామ్‌లో ఎందుకు బీజేపీ విచారణ చేయడం లేదని అడిగారు. రాష్ట్ర మంత్రిపై జరిగిన ఈడీ దాడుల వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదని అన్నారు.

Advertisement

Next Story