- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లలో గోల్ మాల్: మాజీ ఎమ్మెల్యే
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గర్భిణులకు అందజేస్తున్న కేసీఆర్న్యూట్రిషన్కిట్లలో గోల్‌మాల్ జరిగిందని కాంగ్రెస్మాజీ ఎమ్మెల్యే అనిల్ ఆరోపించారు. గాంధీభవన్‌లో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కిట్ కాంట్రాక్టును పల్లా రాజేశ్వర్ రెడ్డి తమ్ముడి కంపెనీకి ఇచ్చారని తెలిపారు. కిట్ ధర రూ.1,400 విలువ ఉంటే, ప్రభుత్వం మాత్రం రెండు వేలు చెప్పున కొని కాంట్రాక్టర్లకు దోపిడీకి అవకాశం ఇచ్చిందన్నారు. పల్లాకు చెందిన రీడర్స్ సంస్థకు అనుబంధంగా ఉన్న సంస్థకు కిట్ల కాంట్రాక్టును కట్టబెట్టడం విచిత్రంగా ఉన్నదన్నారు.
లైట్ హౌస్ సంస్థ రూ.1,400 కోడ్ చేసినా...రూ. 2 వేల కోడ్ చేసిన పల్లా రాజేశ్వర్రెడ్డి కంపెనీకి కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లా పెట్టుబడిదారుడని, కానీ ప్రజాసేవ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నాడన్నారు. ఎమ్మెల్సీ హోదాలో ప్రజల సొమ్మును అక్రమ పద్ధతిలో దోపిడి చేస్తున్నాడని ఆరోపించారు. అనురాగ్ యూనివర్సిటీ భూములో అసైన్డ్ భూములు ఉన్నాయని, కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో స్కూల్‌లకు ఫర్నీచర్ సప్లై చేసే కాంట్రాక్టు కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి చెందిన కేంద్రీయ బండార్ కంపెనీకే ఇచ్చారన్నారు. పల్లా దోపిడీలపై సీఐబీకు ఫిర్యాదు చేస్తామని, కోర్డుకు కూడా వెళ్లనున్నట్లు అనిల్తెలిపారు. మాజీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి యాత్రతో బీఆర్ఎస్ నేతల్లో భయం కనిపిస్తుందన్నారు.