- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసులకు మాజీ CM కేసీఆర్ వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీసులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం కరీంనగర్‌లో నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడారు. తమ కార్యకర్తలపై దౌర్జన్యాలు చేయొద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో కూడా గ్రామాల్లో ప్రజల్ని పోలీసులు బెదిరిస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదు. పోలీసులు రాజకీయాలు చేసుడేంది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మేం పదేళ్లు అధికారంలో ఉన్నాం. కానీ ఇలాంటి దౌర్జన్యాలు ఏనాడూ చేయలేదు. ఆ నాడు మేము చేయించి ఉంటే ఇవాళ కాంగ్రెస్‌లో ఎవరూ ఉండకపోతుంటే అని కేసీఆర్ అన్నారు. తాము పదేళ్ల కాలంలో అభివృద్ధిపైనే దృష్టి పెట్టామని అన్నారు. దమ్ముంటే ప్రభుత్వం సంక్షేమం మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఇంకెన్నాళ్లు బీఆర్ఎస్‌పై అక్కసు వెళ్లగక్కుతూ కాలం వెళ్లదీస్తారని మండిపడ్డారు. మా కంటే గొప్పగా పనిచేసి ప్రజల మనసు గెలవాలి కానీ, దుష్ప్రచారం చేయడం సరికాదని అన్నారు.