PH.D చేయాలనుకునే వారికి శుభవార్త.. పీజీ లేకుండానే!

by GSrikanth |
PH.D చేయాలనుకునే వారికి శుభవార్త.. పీజీ లేకుండానే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అమెరికా, ఇతర దేశాల్లోని పలు యూనివర్శిటీల్లో డిగ్రీ అనంతరం నేరుగా పీహెచ్డీ చేసుకునే అవకాశముందని, అదే విధానాన్ని జేఎన్ టీయూలో అమలు చేయడంపై కసరత్తు చేస్తున్నట్లు వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కట్టా నరసింహారెడ్డి అన్నారు. గురువారం వర్సిటీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రెడిట్స్ ప్రకారం విద్యార్థులను పీహెచ్డీకి అవకాశం కల్పించడంపై చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అన్నీ కొలిక్కి వస్తే వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. జేఎన్టీయూ 11వ స్నాతకోత్సవాన్ని ఈనెల 18న నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళి సై హాజరుకానున్నారని తెలిపారు. యూజీ, పీజీ, పీహెచ్డీ విభాగాలు కలిపి మొత్తం 92,005 మంది విద్యార్థులకు పట్టాలు, 46 గోల్డ్ మెడల్స్ అందించనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story