- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నాసా పరీక్షలో మొదటి ర్యాంక్.. విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే

దిశ, మెట్‌పల్లి : నాసా పరీక్షల్లో అంతర్జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థి ఎడమల శ్రీహన్ రెడ్డిని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అభినందించారు. మల్లాపూర్ మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన ఎడ్మల శ్రీహాన్ రెడ్డి నేషనల్ ఏరోనాటికల్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(NASA) పరీక్షల్లో అంతర్జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించగా మంగళవారం మెట్‌పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యార్థిని అభినందించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీహన్ సాధించిన విజయం కోరుట్ల నియోజకవర్గానికే గర్వకారణం అని ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సంప్రదాయంగా వస్తున్న కోర్సులపై కాకుండా NASA, ISRO లాంటి వాటిపై విద్యార్థులని ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత, తెరాస రాష్ట్ర నాయకులు డా.కల్వకుంట్ల సంజయ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.