Breaking: పోలీసులపై కాల్పులు..హైదరాబాద్ గచ్చిబౌలిలో కలకలం

by srinivas |   ( Updated:2025-02-01 14:54:48.0  )
Breaking: పోలీసులపై కాల్పులు..హైదరాబాద్ గచ్చిబౌలిలో కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ గచ్చిబౌలి(Hyderabad Gachibowli)లో కాల్పుల(Firing) కలకలం రేగింది. పోలీసుల(Police)పై దొంగ(Thief) రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. కానిస్టేబుల్ సహా బౌన్సర్‌కు గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యం అందిస్తున్నారు. ఓ పబ్‌లో దొంగను పట్టుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. కాల్పులు జరిపినా పోలీసులు సాహసం చేసి దొంగను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు ఘటనపై ఆరా తీశారు. కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే ‘దొంగ ఎవరు..?, అతనిపై ఎన్ని కేసులు ఉన్నాయి. ఎంత కాలం నుంచి పరారీలో ఉన్నారు. అసలు దొంగ ఎందుకు కాల్పులు జరిపారు. దొంగకు గన్ ఎక్కడిది.?’ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అయితే ఈ ఘటనతో పబ్ లోపలా, బయటా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా కాల్పుల శబ్ధంతో స్థానికులు సైతం భయాందోళనకు గురయ్యారు. దొంగ కాల్పులు జరుపుతున్న సమయంలో ఏం జరుగుతుందో అర్ధం కాక గందరగోళానికి గురయ్యారు. పోలీసులు, దొంగలను చూసి ఒక్కసారిగా హడలిపోయారు. ఆందోళన చెందారు. దొంగను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో ఊపరి పీల్చుకున్నారు. మరోవైపు దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed