- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నకిలీ సర్టిఫికెట్ల దందాలో పట్టుబడ్డ సినిమా డైరెక్టర్
దిశ, వెబ్‌డెస్క్: నకిలీ సర్టిఫికెట్ల దందాలో సినిమా డైరెక్టర్ పట్టుబడటం కలకలం రేపింది. సినిమా డైరెక్టర్ ముఠాగా ఏర్పడి ఇంటర్, డిగ్రీ, బీ టెక్ సర్టిఫికెట్లను అమ్మకానికి పెట్టాడు. అయితే ఎల్బీనగర్ ఎస్ వో టీ పోలీసులు ముఠాలోని ముగ్గురిని తాజాగా అరెస్ట్ చేశారు. వీరి నుంచి 39 ఫేక్ సర్టఫికెట్లు, 486 హోలో గ్రామ్ లు కారు, ఎనిమిది సెల్ ఫోన్లు, రబ్బర్ స్టాంప్ లు స్వాధీనం చేసుకున్నారు. అయితే సినిమా డైరెక్టర్, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చి గోదావరి జిల్లాకు చెందిన తాడి శెట్ట రేణుకేష్(48) ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తున్నాడు.
నకిలీ సర్టిఫికెట్లు అమ్మే హిమాచల్ ప్రదేశ్ కు చెందిన రాహుల్ దీక్షిత్ తో రేణుకేష్ కు పరిచయం ఏర్పడింది. వైఫ్ సినిమా డైరెక్టర్, నటుడు రావిపల్లి రాంభద్రరావు(62), అతని రిలేటివ్, హైదరాబాద్ ఎర్రగడ్డలో కన్సల్టెన్సీ నిర్వాహకుడు అన్నం దినేష్, యూసుఫ్ గూడకు చెందిన గొల్లపల్లి శ్రవణ్ తదితరులతో పరిచయం ఉంది. వీరంతా ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ తదితర కోర్సుల సర్టిఫికెట్లను రూ.లక్ష నుంచి రూ.1.5లక్షలకు అమ్ముతున్నారు. పక్కా సమాచారం అందడంతో ఎల్బీ నగర్ ఎస్ వోటీ పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు. నిందితులు ఇప్పటి వరకు 70 -80 ఫేక్ సర్టిఫికెట్లు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నకిలీ ముఠా ఎలా సర్టిఫికెట్లు సంపాదిస్తుంది అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.