TGNPDCL - విద్యుత్ అధికారుల పొలం బాట

by Ramesh N |
TGNPDCL - విద్యుత్ అధికారుల పొలం బాట
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీజీఎన్‌పీడీసీఎల్ విద్యుత్ అధికారులు పొలం బాట పట్టారు. తాజాగా కామారెడ్డి జిల్లా, బీబీపేట్ సెక్షన్ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది బీబీపేట్ గ్రామంలో గల ఎస్ఎస్ 260 63కేవీఏ ట్రాన్స్ఫార్మర్‌కు చెందిన రైతులతో పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలోనే విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారికి మోటార్లకు కెపాసిటర్లు పెట్టుకుంటే కలిగే లాభాలపై అధికారులు రైతులకు వివరిస్తున్నారు.

ట్రాన్స్ఫార్మర్ పైన ఉన్న లూస్ లైన్ లను సరిచేసి, పోల్‌కూ పోల్ మధ్య వైర్లు తగలకుండా స్పేసర్స్ బిగించుట, ట్రాన్స్ఫార్మర్ ఎర్తింగ్ నవీనీకరించుటం జరిగిందని అధికారులు తెలిపారు. రైతులకు తడి చేతులతో స్టార్టర్ బాక్సులు ముట్టుకోకూడదని, ఐరన్ స్టార్టర్ బాక్సులు బదులు ప్లాస్టిక్ స్టార్టర్స్ ను పెట్టుకోవాలని తెలియజేసినట్లు వెల్లడించారు. విద్యుత్ లైన్ మెన్ కూ చెప్పకుండా ట్రాన్స్ఫర్మర్ దగ్గర ఎలాంటి మరమ్మతులు చెయ్యకూడదని రైతులకూ అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలం లోని విద్యుత్ సిబ్బంది స్థానిక రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story