- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుడ్ న్యూస్.. గడువు పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం
దిశ, వెబ్‌డెస్క్: ధరణి దరఖాస్తుల పరిశీలన గడువును తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఈ నెల 17వ తేదీ వరకు పొడిగిస్తూ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ధరణి పెండింగ్ దరఖాస్తులకు సంబంధించిన స్పెషల్ డ్రైవ్ ఈ నెల 1 నుంచి 9 వరకు నిర్వహించి పరిష్కారించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ డ్రైవ్‌లో ఇప్పటి వరకు 1.06 లక్షల దరఖాస్తులకుపైగా రెవెన్యూ బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి, డెస్క్‌వర్క్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. పెండింగ్ దరఖాస్తుల పరిశీలనకు తహసిల్దార్ కార్యాలయం సిబ్బందిని ప్రత్యేక బృందాలుగా నియమించారు.
ఈ బృందాలు ప్రస్తుతం ధరణి పెండింగ్ దరఖాస్తులకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తూ, ఫీల్డ్‌లో కూడా దరఖాస్తుదారుడే ఉన్నాడా.. లేదా? అన్నది నిర్ధారించుకునేందుకు క్షేత్ర స్థాయి సర్వే చేపట్టాయి. ధరణి పోర్టల్‌లో ఆర్డీవోలు, తహసీల్దారులకు లాగిన్ ఆదేశాలు రాగానే పెండింగ్ దరఖాస్తుల అన్‌లైన్ వర్క్ త్వరలో ప్రారంభం అవుతుందని రెవెన్యూ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో మరోసారి ప్రభుత్వం పరిశీలన గడువును పెంచడం బాధితులకు కాస్త ఉపశమనం కలిగిస్తోంది.