- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐస్ క్రీం నుంచి అల్లం వెల్లుల్లి వరకు అంతా కల్తీమయం..!
దిశ తెలంగాణ క్రైం బ్యూరో : ‘‘ రాష్ట్రంలో ఆహార పదార్థాల కల్తీకి పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించండి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అవసరమైతే చట్టంలో మార్పులు తీసుకు వద్దాం. ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదు. ఈ దందాకు నూటికి నూరుపాళ్లు చెక్పెట్టటానికి అవసరమైన పకడ్బందీ చర్యలన్నీ తీసుకోవాలి..’’ అని 2017 జూలైలో ముఖ్యమంత్రి కేసీఆర్అన్న మాటలివి. అప్పట్లో ఆ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇది జరిగి అయిదేళ్లు గడిచింది.
అయినా.. ఆహార పదార్థాల కల్తీదందాను అరికట్టేందుకు అవసరమైతే చట్టంలో మార్పులు తీసుకువద్దామని సీఎం కేసీఆర్‌మాటలు నీటి మీద రాతలే అయ్యాయి. కొన్నాళ్లు హడావిడి చేసిన అధికారులు ఆ తర్వాత మామూలే అన్నట్టుగా వ్యవహరిస్తుండగా.. కల్తీ వ్యాపారానికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. గడిచిన రెండు నెలల్లోనే చిన్న పిల్లలు తినే చాక్లెట్ మొదలుకుని వంటింట్లో వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్వరకు కల్తీవి తయారు చేసే ముఠాలు పట్టుబడుతుండడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది.
ఏం తినేటట్టు లేదు..
పిల్లలకు చాక్లెట్లు.. ఐస్‌క్రీం కొనిద్దామన్నా.. పాలు తాగించాలన్నా.. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే పరిస్థితి నెలకొని ఉంది. కాదేదీ కల్తీకనర్హం అన్నట్టుగా కొందరు అక్రమార్కులు డబ్బు సంపాదనే లక్ష్యంగా అన్నీ కల్తీమయం చేస్తున్నారు. ఆకర్షణీయంగా ప్యాక్‌చేసి మార్కెట్లలోకి తెస్తున్నారు. రోడ్డు పక్కన ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, చిన్న హోటళ్లలో జంతు కళేబరాల కొవ్వు నుండి తీసిన నూనె తో చికెన్ చేసిన ఫుడ్‌ను అమ్ముతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కొన్ని నిదర్శనాలు..
చాక్లెట్లు, బిస్కెట్లు ఇలా ప్రతి దాన్ని రీసైక్లింగ్‌చేసి తిరిగి ప్యాక్‌చేసి రాష్ర్టవ్యాప్తంగా మార్కెటింగ్చేస్తూ.. రాచకొండ ఎస్వోటీ పోలీసులకు ఏప్రిల్14న పట్టుబడ్డ గ్యాంగ్ఉదంతాన్ని పేర్కొనవచ్చు. కోఠిలోని హరిహంత్సంస్థ హైదరాబాద్ వ్యాప్తంగా కిరాణా షాపుల నుంచి ఎక్స్పైరీ డేట్దాటిన చాక్లెట్లు, బిస్కెట్లు, లాలీపాప్ లు తదితర వాటిని నామమాత్రపు ధరకు కొనుగోలు చేసి బోడుప్పల్సమీపంలోని గోడౌన్‌కు తరలించేది. అక్కడ వీటన్నింటినీ రీసైక్లింగ్‌చేసి తిరిగి అవే కవర్లలో ప్యాక్‌చేసి హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిందితులు విక్రయిస్తూ వచ్చారు. పక్కా సమాచారం అందటంతో ఎస్వోటీ పోలీసులు దాడి చేసి రూ. లక్షల విలువైన కల్తీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
కాటేదాన్పారిశ్రామికవాడలో రెండేళ్లుగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్న ఇద్దరిని ఎస్వోటీ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. దీంతోపాటు చిన్నపిల్లలు తాగే మ్యాంగో జ్యూస్‌కు కూడా ఈ గ్యాంగ్లిటిల్ఛాంప్స్పేరుతో కల్తీ పౌడర్‌ను తయారు చేసి అమ్ముతుండటం గమనార్హం. భూదాన్‌పోచంపల్లి మండలంలో నాణ్యత లేని పౌడర్‌తో పాలు తయారు చేసి అమ్ముతున్న వ్యక్తిని ఏప్రిల్ 24న రాచకొండ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి ముందు జనవరి 2న బీబీనగర్గూడూరు చెక్‌పోస్టు వద్ద కుమార్‌యాదవ్‌ను అరెస్టు చేసిన కల్తీ పాలను సీజ్ చేశారు. పాలు పగిలిపోకుండా ఉండడానికి నిందితుడు వాటిలో హైడ్రోజన్పెరాక్సైడ్ రసాయనం కలిపి అమ్ముతున్నట్టు విచారణలో వెల్లడైంది.
ఐస్‌క్రీంలు కూడా..
ఏప్రిల్14న ఎస్వోటీ పోలీసులు చందానగర్‌లోని ఓ ఐస్ క్రీమ్ తయారీ యూనిట్‌పై దాడి చేశారు. తనిఖీల్లో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి పదిమందిని ఉద్యోగులుగా పెట్టుకుని ఎక్స్పైర్అయిన సింథటిక్ కలర్స్, రసాయనాలు వాడి వెనిల్లా, చాక్లెట్, బటర్‌స్కాచ్ ఇలా అన్ని రకాల ఐస్ క్రీంలు తయారు చేసి మార్కెట్లో సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. రాచకొండ ఎస్వోటీలోని ఓ అధికారితో మాట్లాడగా పట్టుబడ్డ కల్తీ ముఠాలు కొన్నేనని చెప్పారు. హైదరాబాద్ తో పాటు శివార్లలో ఇలాంటి దందా జరుపుతున్న వారి సంఖ్య పదుల్లో ఉంటుందన్నారు. చట్టంలో కఠిన శిక్షలు లేకపోవటంతో అరెస్టవుతున్నా బెయిల్తీసుకుని బయటకు వస్తున్న నిందితులు అడ్డాలు మారుస్తూ ఈ దందా కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
కల్తీలతోనే రోగాలు
కల్తీ ఆహార పదార్థాలను తింటుండటం వల్ల రోగాలు పెరుగుతున్నట్టు సీనియర్ డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. పాతికేళ్లు నిండక ముందే బ్లడ్‌ప్రెషర్, అజీర్తి, ఎసిడిటీ లాంటి వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం దీనిని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. కల్తీ ఆహార పదార్థాలతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా సోకుతాయని చెప్పారు. వీలైనంత వరకు బయట ఫుడ్ తినకపోవడమే మేలని సూచించారు.