Minister Harish Rao:ప్రతి ఒక్కరు యోగా చేయాలి..

by Anjali |   ( Updated:2023-06-21 06:38:12.0  )
Minister Harish Rao:ప్రతి ఒక్కరు యోగా చేయాలి..
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గంట పాటు యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారని మంత్రి హరీష్ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ క్రికెట్ స్టేడియంలో 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మంత్రి హాజరై మాట్లాడారు. ఒక్కసారి బీపీ, షుగర్ వస్తే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. పెద్ద పెద్ద ఆస్పత్రులు కట్టడంతోనే ఆరోగ్య తెలంగాణ కాదని, ప్రజలు ఆస్పత్రులకు వెళ్లకుండా ఉన్నప్పుడే ఆరోగ్య తెలంగాణ వచ్చినట్లని తెలిపారు. పచ్చదనం పెంపొందించడంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు.

Also Read..

శంకరమ్మకు బీఆర్ఎస్ అధిష్టానం పిలుపు.. కారణమదేనా..?

Advertisement

Next Story