KTR : ప్రతి రూపాయికి లెక్క ఉంది : కేటీఆర్ ట్వీట్

by M.Rajitha |   ( Updated:2025-01-16 04:31:08.0  )
KTR : ప్రతి రూపాయికి లెక్క ఉంది : కేటీఆర్ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఫార్ములా ఈ-కార్ రేసింగ్(Formula E- Car Racing) మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నేడు ఈడీ(ED) విచారణను ఎదుర్కొనున్నారు. ఈ నేపథ్యంలో ఫార్ములా రేసింగ్ లో నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలను ఆయన ఖండించారు. "హైదరాబాద్‌(Hyderabad)లో ఫార్ములా ఈ రేసింగ్ ని హోస్ట్ చేయడం మంత్రిగా నా అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలలో ఒకటి. అంతర్జాతీయ రేసర్లు & ఇ-మొబిలిటీ పరిశ్రమల పెద్దలు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసించడం నేను గర్వంగా భావిస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పనికిమాలిన కేసులు, రాజకీయ కుట్రలు నన్నేం చేయలేవు. ఎఫ్ఈవోకి (FEO) రూ. 46 కోట్లు బ్యాంక్-టు-బ్యాంక్ లావాదేవీ ద్వారా చెల్లించబడింది. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు. ప్రతి రూపాయికి క్లియర్ గా లెక్క ఉన్నపుడు.. ఇందులో అవినీతి దుర్వినియోగం, మనీ లాండరింగ్ ఎక్కడ ఉంది?. త్వరలోనే నిజాలు బయటికి వస్తాయి. న్యాయం కోసం మా పోరాటాన్ని ఎప్పటికీ కొనసాగిస్తాం.." అంటూ కేటీఆర్ తన ఎక్స్ ఖాతా వేదికగా ట్వీట్ చేశారు.

Next Story