BJP: తెలంగాణ ఎడారి కావొద్దనే బడ్జెట్‌లో ఏపీకి రూ. 15 వేల కోట్ల నిధులు

by Mahesh |
BJP: తెలంగాణ ఎడారి కావొద్దనే బడ్జెట్‌లో ఏపీకి రూ. 15 వేల కోట్ల నిధులు
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, ఓడిశా రాష్ట్రాలకు పెద్దమొత్తంలో నిధులు కేటాయించారు. దీంతో 8 మంది ఎంపీలను గెలిపించిన తెలంగాణకు ఎటువంటి నిధులు మంజూరు చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయంపై తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ చర్చకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఎడారి కావొద్దనే బడ్జెట్‌లో ఏపీకి రూ. 15 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. విభజన చట్టం ప్రకారం.. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తే తెలంగాణ ఎడారిలా మారేదని.. ఆయన క్లారిటీ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కు కేవలం 15 వేల కోట్ల నిధులు ఇచ్చి.. స్పెషల్ స్టేటస్ ఇవ్వనందుకు మోడీకి తెలంగాణ ప్రజలు పాలాభిషేకం చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతరం కాంగ్రెస్ సభ్యులు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని చర్చ చేపట్టడంతో బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

Advertisement

Next Story