- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొంగులేటి, జూపల్లిని అందుకే కలిశాము: ఈటల
దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకులు పొంగులేటి శ్రీనివాస రెడ్డితో భేటీ అనంతరం బీజేపీ కీలక నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి ఇంటివద్ద ఈటల మీడియాతో మాట్లాడుతూ.. పొంగులేటి, జూపల్లి కృష్ణారావుతో తనకు వ్యక్తిగత అనుబంధం ఉందని అన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆదేశాలతోనే పొంగులేటి, జూపల్లిని కలిసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలతో పాటు వారిద్దరు కేసీఆర్ పాలనపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని వెల్లడించారు. తమ ఆశయం.. వారి ఆశయం ఒకటే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌తో కొట్లాడే పార్టీ బీజేపీ ఒక్కటే అని అన్నారు. 2014 నుంచే కాంగ్రెస్‌ను ఖతం చేయాలని కేసీఆర్ చూస్తున్నారు.. అందులో భాగంగానే కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లోకి తీసుకెళ్లారని అన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా అందరం కలిసి పనిచేయాలని కోరామని స్పష్టం చేశారు. కాగా, ఏ పార్టీలో చేరాలనే దానిపై పొంగులేటి ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. తన అనుచరులతో మాట్లాడి నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది.