- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉత్సాహంగా సేవా భారతి "రన్ ఫర్ గర్ల్ చైల్డ్" 2025

దిశ, తెలంగాణ బ్యూరో: సేవా భారతి తెలంగాణ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం ఉదయం రన్ ఫర్ గర్ల్ చైల్డ్ 5కే, ,10 కే, 21 కే రన్నింగ్ కార్యక్రమాలు జరిగాయి. ఈ పోటీల అనంతరం జరిగిన కార్యక్రమానికి ఎంఎల్ఏ అరికెపూడి గాంధీతో కలిసి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సమాజంలోని అభాగ్య వర్గాల అభ్యున్నతి కోసం సేవా భారతి తెలంగాణ చేస్తున్న కృషిని శ్రీధర్ బాబు ప్రశంసించారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఆడపిల్లల సాధికారత కోసం ఉద్దేశించిన కార్యక్రమాల ప్రాముఖ్యతక ను అభినందించారు.
ఇప్పటికే సేవా భారతి 10,500 మంది బాలికల జీవితాలను ప్రభావితం చేసిందని, 2030 నాటికి లక్ష మంది లక్ష్యంతో ముందుకు సాగాలని శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఏ గాంధీ, గ్లోబల్ డేటా డైరెక్టర్ రాజీవ్ గుప్తా, పాల్టెక్ శ్యాంపాల్ రెడ్డి, ఫ్రీడమ్ ఆయిల్ జి.యం చేతన్ , సేవాభారతి తెలంగాణ అధ్యక్షుడు దుర్గారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి పరాగ్ అభయాంకర్, ఇన్ఫోసిస్ సిఎస్ఆర్ హెడ్ వంశీపరం జ్యోతి, ఫిల్టరేషన్ గ్రూప్ సి.ఎఫ్.ఓ వినోద్, యూఎస్టీ గ్లోబల్ సిఎస్.ఆర్ హెడ్ తిరుమల్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.