పాతికేళ్ల తర్వాత పదోన్నతులు.. CM రేవంత్‌కు కృతజ్ఞతలు

by Gantepaka Srikanth |
పాతికేళ్ల తర్వాత పదోన్నతులు.. CM రేవంత్‌కు కృతజ్ఞతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎక్స్‌టెన్షన్ల పర్వం ముగించి, పాతికేళ్ల తర్వాత డీపీసీ నిర్వహించి పదోన్నతులు కల్పించడం ఆనందంగా ఉందని హైదరాబాద్ ఇంజనీర్ల సంఘం హర్షం ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, తెలంగాణ రాష్ట్రంలో గానీ మొదటి సారిగా నీటి పారుదల శాఖలో ఎక్స్‌టెన్షన్లో ఒక్క ఉద్యోగి లేకుండా చేశారని తెలిపారు. ఈ ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి దక్కిందని పేర్కొన్నారు. దీనికి సహకరించిన నీటి పారుదల శాఖ సెక్రెటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రెటరీ ప్రశాంత్ పాటిల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో మంది ఏఈఈల నుంచి సీఈల వరకూ ఇంజనీర్లకు ప్రమోషన్లలో లబ్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ప్రమోషన్స్‌తో ఏర్పడ్డ ఖాళీలను తెలంగాణ నిరుద్యోగులతో భర్తీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.



Next Story